టెర్రరిస్టు అరెస్టు, గ్రెనేడ్లు స్వాధీనం

5 Dec, 2016 19:26 IST|Sakshi
జమ్మూకశ్మీర్: నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఓ చొరబాటుదారుడుని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్ లో పూంచ్ సెక్టార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాది బిలాల్ షేక్(40)గా భద్రతా దళాలు గుర్తించాయి.
 
పట్టుబడిన ఉగ్రవాది నుంచి పెద్ద ఎత్తున గ్రెనేడ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది. 
మరిన్ని వార్తలు