టీనేజ్‌లో జయలలిత అంటే పడిచచ్చేవాణ్ని!

27 Mar, 2017 19:20 IST|Sakshi
టీనేజ్‌లో జయలలిత అంటే పడిచచ్చేవాణ్ని!

ఏ మోహమాటం లేకుండా మనస్సులో మాట సూటిగా చెప్పడం జస్టిస్‌ మార్కండేయ కట్జూ శైలి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. గతంలో ఆమెను రెండుసార్లు తాను కలిసినప్పటి జ్ఞాపకాలను ఫేస్‌బుక్‌లో నెమరు వేసుకున్నారు కట్జూ. జయలలిత పక్కన తాను కూర్చున్న ఫొటోను ఎఫ్‌బీలో పెట్టి.. 'షేర్నీ ఔర్‌ షేర్‌' (పులి-పులి) అంటూ కామెంట్‌ చేశారు. జయలలిత మీద అపారమైన గౌరవాన్ని చూపెట్టిన ఆయన తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని వెల్లడించారు. తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే పడిచచ్చేవాడినంటూ ఇన్నాళ్లు దాచిన ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు.

'నేను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేదని అనుకునేవాడిని. మనస్సులో ఉండిపోయిన ఆ ప్రేమ గురించి జయలలితకు తెలియదు. ఆమె 1948 ఫిబ్రవరిలో జన్మించగా, నేను 1946 సెప్టెంబర్‌లో పుట్టాను. 2004 నవంబర్‌లో చెన్నై రాజ్‌భవన్‌లో మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నా ప్రమాణం సందర్భంగా ఆమెను తొలిసారి కలిశాను. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి. అప్పటికీ అందంగా ఉంది. నా యవ్వనంలో కలిగిన భావనను అప్పుడు ఆమెకు చెప్పడం సరికాదని అనిపించింది' అని కట్జూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జయలలిత సినిమా పాటను కూడా షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు