ఐసీఐసీఐ కూడా...

3 Jan, 2017 09:29 IST|Sakshi
ఐసీఐసీఐ కూడా...

ముంబై:   ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల సరసన ప్రయివేట్ రంగ బ్యాంకు కూడా చేరిపోయింది.  రుణాలపై వడ్డీరేటు కోతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్  బ్యాంకు  సహా  అనేక ఇతర బ్యాంకుల బాటలో  ఐసీఐసీఐ కూడా పయనించింది.  గృహ, వాహన, ఇతర రుణాలను ఇక మరింత చౌకగా  అందించనుంది. ఎంసీఎల్ ఆర్ లో 0.7శాతం   కోత పెట్టింది. తమ  బేస్ లెండింగ్ రేటు లో వార్షిక  రేటును 8.20 శాతంగా నిర్ణయించినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.  సవరించిన ఈ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి  రానున్నట్టు తెలిపింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా  బ్యాంకులన్నీ రుణాలపై వడ్డీరేట్లలో  కోతపెడుతున్నాయి.  ముఖ్యంగా ఎస్ బీఐ, పీఎన్ బీ  సహా  కోటక్ మహీంద్రా బ్యాంక్, దేనా బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , యూనియన్ బ్యాంక్  వంటి ఇతర రుణదాతలు కూడా ఎంసీఎల్ ఆర్ లో కోత పెట్టిన సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు