చైనాతో త్వరలో అవగాహన ఒప్పందం: ఆంటోనీ

26 Jul, 2013 16:14 IST|Sakshi
చైనాతో త్వరలో అవగాహన ఒప్పందం: ఆంటోనీ

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో సైనికులు చొరబడ్డారు అన్న ఆరోపణలు ఇక ముందు రాకుండా భారత్‌-చైనాలు త్వరలోనే ఒక అవగాహన కుదుర్చుకుంటాయని రక్షణ మంత్రి ఏకే అంటోనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కోసం ఇరు దేశాల నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో త్వరలోనే భేటీ అవుతారన్నారు.

అంతకు ముందు ఏకే అంటోనీ.. కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ సందర్భంగా అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్గిల్‌ యుద్ధం ముగిసి నేటికి 14 ఏళ్లు అయిన సందర్భంగా అనాటి సైనికుల త్యాగాలను గుర్తు చేశారు. అలాగే.. భారత్‌- చైనా సరిహద్దుల గురించి ఏకే అంటోని మాట్లాడుతూ.. చైనా- భారత్‌ల మధ్య జరుగుతున్న చర్చలు సరిహద్దుల గురించి శాశ్వత పరిష్కారం లభించేంత వరకు కొనసాగుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు