యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్

20 Sep, 2013 13:09 IST|Sakshi

అమెరికా (యూఎస్)లో మరో భారత సంతతి వ్యక్తిని కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ మనీష్ ఎస్ షా నియమితులయ్యారు. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తన స్వరాష్ట్రం ఇలినాయిస్లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయను నామినేట్ చేశారు. షాతో సహా ఏడుగురి నియామకాలను ఒబామా ఖరారు చేసినట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

న్యూయార్క్లో జన్మించిన 40 ఏళ్ల షా ప్రస్తుతం క్రిమినల్ డివిజన్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  2011-12 మధ్య కాలంలో ఆయన క్రిమినల్స్ అపీల్స్ చీఫ్గా పనిచేశారు. గతంలో ఆర్థిక నేరాలు, ప్రత్యేక విచారణ విభాగం డిప్యూటీ చీఫ్గా వ్యవహరించారు. షా తాజా నియామకాన్ని ఇలినాయిస్ రాష్ట్రానికి చెందిన సెనెటర్లు డెమోక్రట్ డిర్క్ డర్బిన్, రిపబ్లికన్ మార్క్ కిర్క్ స్వాగతించారు.

>
మరిన్ని వార్తలు