Sakshi News home page

వడ్డీరేట్లు పెంచి షాక్ ఇచ్చిన ఆర్బీఐ

Published Fri, Sep 20 2013 12:53 PM

వడ్డీరేట్లు పెంచి షాక్ ఇచ్చిన ఆర్బీఐ - Sakshi

ముంబయి : స్టాక్‌ మార్కెట్లకు, పారిశ్రామిక రంగానికి, మధ్యతరగతి జనానికి  రిజర్వ్‌ బ్యాంకు షాక్‌ ఇచ్చింది. అధిక వడ్డీరేట్ల కారణంగా మూడేళ్లుగా అందరూ అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ఈవాళ్టి సమీక్ష సమావేశంలో ఆర్బీఐ వడ్డీరేటు పెంచింది. బ్యాంకులకు ప్రామాణికంగా ఉండే రెపోరేటును 0.25 శాతం పెంచింది. పెంపు తర్వాత రెపోరేటు 7.5 శాతానికి చేరింది. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగా రావడంతో రిజర్వ్‌ బ్యాంకు ఆందోళన చెందుతోంది.

ధరలు దిగి రావాలంటే వడ్డీరేట్లు పెంచడమే శరణ్యమని భావిస్తోంది. మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఇదే పాలసీని అవలంభించారు. కొత్తగా వచ్చిన రఘురామ్‌ రాజన్‌ అయినా పరిస్థితిని మారుస్తారని చాలా మంది ఆశించారు. అయితే రాజన్‌ కూడా సుబ్బారావు బాటలోనే పయనించారు. రాజన్‌ నిర్ణయంతో సెన్సెక్స్‌ ఒక్కసారిగా 500ల పాయింట్లు పడింది. నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయింది.

Advertisement
Advertisement