ఇండో అమెరికన్‌కు రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి

1 Mar, 2015 00:51 IST|Sakshi
ఇండో అమెరికన్‌కు రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి

వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్‌బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని చేశారని రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్‌ఎన్‌సీ) చైర్మన్ ప్రెయీబస్ చెప్పారు.
 
 అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత సంతతివారికి కీలక పదవులను కట్టబెట్టిన నేపథ్యంలో షా రిపబ్లికన్ల తరపున అమెరికా భారతీయులతో రానున్న ఎన్నికల్లో మంచి సంబంధాలు ఏర్పరచగలరని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఒబామా ప్రభుత్వంలోని కీలక బాధ్యతల నుంచి రాజ్‌షా గతవారమే తప్పుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు