కేంద్ర బడ్జెట్పై ఎవరెవరూ ఏమన్నారు?

28 Feb, 2015 17:29 IST|Sakshi

హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై పలుపార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. శనివారం జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకమైందని, అసంఘటిత వర్గాలకు పింఛన్ కల్పించడం గొప్ప విషయంగా జవదేకర్ పేర్కొన్నారు. సామాన్యుడి అశయాలకు ఈ బడ్జెట్ భిన్నంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఈ రోజు దుర్దినమని, విభజన హామీలను కేంద్రం విస్మరించిందని ఎంపీ జేడీ శీలం తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కేంద్రం న్యాయం చేయలేకపోయిందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మహిళలకు నిధులు పెంచడం మంచి విషయని.. అవి ఉపయోగపడితే మరింత మంచిదని బుట్టా రేణుక అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్ ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదని, పేదరిక నిర్మూలనకు ఈ బడ్జెట్లో చేసిందేమీ లేదని ఎంపీ వరప్రసాద్ చెప్పారు. ఈ బడ్జెట్పై టీడీపీ చాలా అసంతృప్తిగా ఉందని ఎంపీ శివప్రసాద్ అన్నారు. దీనిపై చంద్రబాబు ఆదేశిస్తే కేంద్రంపై పోరాటం చేస్తామని శివప్రసాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు