దూసుకెళ్లిన మారుతీ...

23 Sep, 2016 19:39 IST|Sakshi
దూసుకెళ్లిన మారుతీ...
న్యూఢిల్లీ : దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీదారిగా పేరున్న మారుతీ సుజుకీ, ఎగుమతుల్లో రయ్ రయ్మని పరిగెడుతోంది.  క్యూములేటివ్ ఎగుమతుల్లో కంపెనీ 15 లక్షల వాహనాల మైలురాయిని చేధించిందని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి 100 దేశాలకు పైగా ఈ ఎగుమతులు జరిపినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో మోడల్ను ఎక్స్క్లూజివ్గా భారత్లోనే తయారు చేసింది. ఇండియా నుంచి జపాన్కు ఎగుమతి అయిన మొదటికారు ఇదే కావడం విశేషం. 
 
1987-88 మధ్య కాలంలో మారుతీ సుజుకీ ఇండియా యూరప్కు వాహనాలు ఎగుమతి చేయడం ప్రారంభించింది. మొదట మెల్లగా ఎగుమతులు ప్రారంభించిన ఈ కంపెనీ, ఆయా దేశాల్లోనే ఎకనామిక్, పాలసీ విధానాలకు అనుగుణంగా ఎగుమతులను పెంచింది. గత కొంతకాలంగా కంపెనీ ఎగుమతుల్లో శరవేగంగా దూసుకెళ్తూ, అప్వర్డ్ ట్రెండ్ను కొనసాగిస్తున్నట్టు కంపెనీ హర్షం వ్యక్తంచేసింది. కొత్త కొత్త మోడల్స్ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తూ, మరిన్ని కొత్త దేశాలకు తమ మోడల్స్ను ఎగుమతి చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అంతర్జాతీయ మార్కెట్లో తమకున్న స్థానాన్ని ఇలానే కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తంచేసింది. వాహన రంగంలో తీవ్ర పోటీ ఉన్న యూరప్ వంటి దేశాల్లో జెన్, ఏ-స్టార్, మారుతీ 800, ఆల్టో మోడల్స్ దూసుకెళ్తున్నాయని కంపెనీ పేర్కొంది. 2015-16లో టాప్ ఎక్స్పోర్ట్ మోడల్స్గా ఆల్టో, సిఫ్ట్, సెలిరియో, బెలెనో, సియాజ్లు నిలిచాయి. శ్రీలంక, చిల్లీ, ఫిలిప్పీన్స్, పెరూ, బొలివియాలు టాప్ ఎక్స్పోర్ట్ మార్కెట్లుగా ఉన్నాయి. 
>
మరిన్ని వార్తలు