-

కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ

27 Jan, 2017 18:21 IST|Sakshi
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ధరల మోత మోగించింది. తన అన్ని మోడల్స్పై రూ.8014వరకు ధరలు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది.  పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఎక్స్షోరూం న్యూఢిల్లీలో తన అన్ని మోడల్స్పై రూ.1500 నుంచి రూ.8014 వరకు ధరలు పెంచుతున్నట్టు మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కమోడిటీ, ట్రాన్స్పోర్టేషన్, అడ్మినిస్ట్రేటివ్ ధరలు పెరగడంతో కార్ల ధరలు పెంచుతున్నట్టు మారుతీసుజుకీ చెప్పింది. హ్యాచ్బ్యాక్ ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాస్ఓవర్ ఎస్-క్రాస్ వరకు మోడల్స్ను కంపెనీ విక్రయిస్తోంది.
 
వీటి ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీలో ప్రస్తుతం రూ.2.45 లక్షల నుంచి రూ.12.03 లక్షల వరకు ఉన్నాయి.  గతేడాది ఆగస్టులో ఎంఎస్ఐ తన కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రిజాపై రూ.20వేల వరకు ధరలు పెంచింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ బెలానో ధర కూడా రూ.10వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. మిగతా ఎంపికచేసిన మోడల్స్పై ధరలు రూ.1500 నుంచి రూ.5000ల వరకు పెంచుతున్నట్టు చెప్పింది. గతేడాదే వివిధ కార్ల కంపెనీలు తమ  ఇన్పుట్ ధరలు పెరగడంతో హ్యాందాయ్ మోటార్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, టోయోటా, రెనాల్ట్, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, టాటా మోటార్స్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.
 
మరిన్ని వార్తలు