గాడిమొగ టెర్మినల్‌కు ముకేశ్

18 Sep, 2013 03:29 IST|Sakshi

సాక్షి, కాకినాడ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సీఎండీ ముకేశ్ అంబానీ తూర్పుగోదావరి జిల్లా గాడిమొగలోని రిలయన్స్ గ్యాస్ టెర్మినల్‌ను మంగళవారం సందర్శించారు. 2002లో కేజీ బేసిన్‌లోని డీ-6 బావిలో ఆర్‌ఐఎల్ డ్రిల్లింగ్ ప్రారంభించగా 2009 ఏప్రిల్ ఒకటిన గాడిమొగ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించేందుకు మంగళవారం ముఖేశ్ ప్లాంట్‌కు వచ్చారని సమాచారం. ముకేశ్ మరో ముగ్గురు ఉన్నతాధికారులతో కలిసి ముంబై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గాడిమొగకు వచ్చారు. దాదాపు గంటపాటు ప్లాంట్‌లో గడిపిన ముకేశ్ గ్యాస్ ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలపై ప్లాంట్ బాధ్యులతో కొద్దిసేపు చర్చించారని సమాచారం. అధికారుల అభినందన కార్యక్రమం జరిగిన తర్వాత వారితో కలిసి విందుచేసినట్లు తెలుస్తోంది. తొలుత ముకేశ్ ఆఫ్‌షోర్‌లోని కేజీ-డీ6 బావిని కూడా సందర్శించినట్టు తెలిసింది. ఆయన పర్యటన వివరాలను మాత్రం కంపెనీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు.

మరిన్ని వార్తలు