మల్లికా లేటెస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌

4 Feb, 2017 12:31 IST|Sakshi

ముంబై:  బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్  ఆసక్తికరమైన ట్వీట్‌ తో ఆకట్టుకుంటోంది.  బాలీవుడ్ సెక్స్ బాంబ్‌గా, ఐటం గర్ల్‌గా  పేరు గడించిన  మల్లిక  మేనత్త అయిందట.  ఈ సందర్భంగా ముద్దులొలికే  మేనల్లుడి ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌​ చేసింది. 

తనకు అల్లుడు పుట్టినందుకు  సంతోషంగా ఉందంటూ తన సంతోషాన్ని  అభిమానులతో పంచుకుంది. దీంతో  ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్‌లో   వైరల్‌ అయింది.  తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని..తానిపుడు మేనత్తను అని  మల్లిక ట్వీట్‌ చేసింది.  
 

>
మరిన్ని వార్తలు