దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి

17 Oct, 2015 02:03 IST|Sakshi
దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి

ముస్లింలపై హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు నివసించాలనుకుంటే వారు గోమాంసం (బీఫ్) తినడం ఆపేయాలని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘‘ముస్లింలు ఈ దేశంలో ఉండొచ్చు. కానీ అందుకోసం వారు గోమాంసం తినడాన్ని త్యజించాలి. ఎందుకంటే...ఇక్కడ(భారత్‌లో) గోవు మతవిశ్వాసానికి సంబంధించిన విషయం’ వ్యాఖ్యానించారు.  గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూ ను పత్రిక శుక్రవారం ప్రచురించింది.

ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ఇదో దుర్దినమని కాంగ్రెస్ విమర్శించిందది.  అయితే ఆ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. కాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, పత్రిక  వక్రీకరించిందని ఖట్టర్ ఆరోపించారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే విచారం వ్యక్తం చేసానన్నారు.  సీఎం సలహాదారూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలు గోమాంసం వాడొద్దని మేవత్ జిల్లాలో గోశాలలు నడుపుతున్న ముస్లింలు కొందరు సీఎం గోశాలల సందర్శనలో అన్నారని, వారి వ్యాఖ్యలనే ఖట్టర్ ప్రస్తావించారన్నారు.

మరిన్ని వార్తలు