నోకియా 3310, మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌..ధరలు?

27 Feb, 2017 13:59 IST|Sakshi
నోకియా 3310, మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌..ధరలు?

న్యూఢిల్లీ:  నోకియా సంస్థ  తన  ఐకానిక్‌  'నోకియా 3310'  ఫీచర్‌ ఫోన్‌ ను మార్కెట్లో తిరిగి ప్రారంభించింది.  ఇతర మూడు స్మార్ట్‌ ఫోన్లతోపాటు  రూ. 4 వేల లోపు ధరలో క్లాసిక్ నోకియా 3310 ఫీచర్ ఫోన్ ను  మొబైల్ వర్డ్ కాంగ్రెస్ లో  ఆదివారం మార్కెట్లో  లాంచ్‌ చేసింది.  హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ సీఈవో ఆర్టో నుమ్మెల దీన్ని లాంచ్‌ చేశారు.

రూపం పాతదే అయినా కొత్త విజువల్‌ అప్‌గ్రెడేషన్‌, స్వల్ప మార్పులతో దీన్ని  అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా 22 గంటల టాక్ టైమ్‌ తోపాటు, నెలరోజుల బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలుగా  కంపెనీ పేర్కొంది.  

ప్రీమియం వెర్షన్‌ తో పోలిస్తే  స్లిమ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన దీని ధర 49 యూరోలని (సుమారు రూ. 3,400) నోకియా తెలిపింది.  స్నేక్‌ గేమ్‌ తో ఈఫోన్‌ను అప్‌ గ్రేడ్‌ చేసినట్టు తెలిపింది. ఎల్లో, గ్రే, బ్లూ మరియు ఎరుపు రంగుల్లో ఈ హ్యాండ్‌ సెట్‌ అందుబాటులోకి రానుంది. పూర్తిగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా, గూగుల్‌ అసిస్ట్‌తో పనిచేసే  నోకియా స్మార్ట్‌ ఫోన్లను కూడా లాంచ్‌ చేసింది.  నోకియా 3310ను  దూసుకుపోనుందని హెచ్‌ ఎండీ గ్లోబల్‌ ప్రధాన ఉత్పత్తి అధికారి  జుహు  సర్వికాష్‌ తెలిపారు.


గత నెలలో చైనాలోలాంచ్‌ చేసిన నోకియా 6 సహా మరో మూడు స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌ ఆధారంగా  పనిచేసే నోకియా 5, 6, 3 స్మార్ట్‌ ఫోన్లను కూడా పరిచయం చేసింది. నోకియా 6 ధర  సుమారు రూ.16,100గాను, దీనిలోని స్పెషల్‌ ఎడిషన్‌ ధరను సుమారుగా రూ. 21వేలుగాను,  నోకియా 5 ధరను సుమారు 13,300గాను, నోకియా 3 ధర సుమారు 9,700 ఉండనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నోకియాఫోన్లను సృష్టించడానికి ప్రత్యేక హక్కులు పొందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌  నోకియా 3310 తో సహా, ఇవి ఈ ఏడాది  క్వార్టర్‌ 2లో( మార్చి) అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది.


 
నోకియా 3310  ప్రధాన ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ స్క్రీన్
2జీ కనెక్టివిటీ,
16 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్,   
32జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
డ్యూయల్ సిమ్
2 ఎంపీ రియర్ కెమెరా విత్‌ ఎల్ఈడీ ఫ్లాష్
1200 ఎంఏహెచ్‌ బ్యాటరీ







 

మరిన్ని వార్తలు