బడ్జెట్పై శివసేన స్పందన

1 Feb, 2017 18:52 IST|Sakshi
బడ్జెట్పై శివసేన స్పందన

ముంబై: 2017-18 ఆర్థిక బడ్జెట్ పై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది.   బడ్జెట్ పై స్పందించిన బీజేపీ సోదర సంస్థ శివసేన అధినేత ఉధ్దవ్ థాకరే మరోసారి మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఆర్థిక బడ్జెట్ లో ప్రజల ఆకాంక్షలను కేంద్రం అందుకోలేకపోయిందని  ఆరోపించారు.   కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు అచ్ఛే దిన్  తీసుకొస్తామని వాగ్దానం చేశారని.. కానీ. ఎక్కడ ఆ అచ్ఛే దిన్  అని థాకరే ప్రశ్నించారు.  చ్ఛే దిన్ గురించి ప్రభుత్వం ఇపుడు ఎందుకు మాట్లాడటం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలకు అనేక కష్టాలనెదుర్కొన్నారని  థాకరే మండిపడ్డారు.

డీమానిటైజేషన్ తరువాత ఉగ్రదాడులు  తగ్గుముఖం  పడతాయని కేంద్రం చెప్పిందనీ, అయితే  టెర్రరిస్టుల దాడులు తగ్గకపోగా ..మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు.  అలాగే కేంద్ర మంత్రి మనోహరి పారికర్‌ పై వచ్చిన అవినీతి  ఆరోపణలపై స్పందించిన థాకరే  వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలన్నారు.  ఏ రుజువు లేకుండా ఎవరూ అలాంటి విషయాలను చెప్పరని వ్యాఖ్యానించారు.   బుధవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ  పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.  

 

మరిన్ని వార్తలు