ఆక్షన్‌లోకి ప్రజయ్ మెగాపొలిస్!

20 Mar, 2015 23:28 IST|Sakshi
ఆక్షన్‌లోకి ప్రజయ్ మెగాపొలిస్!

హైదరాబాద్: ఫ్లాట్ల వేలం అంటే బ్యాంకులో.. ఆర్థిక సంస్థలో నిర్వహించడం మనకు తెలిసిందే. కానీ, స్థిరాస్తి రంగంలో తొలిసారిగా నిర్మాణ సంస్థే ముందుకొచ్చి ఆక్షన్‌ను నిర్వహిస్తోంది. ప్రజయ్‌లో పెట్టుబడులు పెట్టిన కస్టమర్లకు లాభం చేకూరేలా కూకట్‌పల్లిలో 21.5 ఎకరాల్లో నిర్మిస్తున్న మెగాపొలిస్ ఫేజ్-2లోని దాదాపు 90 ఫ్లాట్లను ఆదివారం ఆక్షన్‌లో పెట్టనున్నట్లు ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏమన్నారంటే..

9 టవర్లలో ఉండే ప్రజయ్ మెగాపొలిస్ ఫేజ్-1లో మొత్తం 1,113 ఫ్లాట్లుంటాయి. ఇందులో 850 ఫ్లాట్లు గతంలోనే అమ్ముడుపోయాయి. మరో 168 ఫ్లాట్లు ఇప్పటికే ఫేజ్-2 నుంచి ఫేజ్-1కి మారాయి. మిగిలిన ఫ్లాట్లను అక్షన్‌లో పెట్టనున్నాం. అది కూడా అమ్మేవారికి, కొనేవారికి ఇద్దరికీ లాభం చేకూరేలా. ఉదాహరణకు మీ ఫ్లాట్ నంబర్.000 అనుకోండి. చ.అ. ధర రూ.2,700. మీ ఫ్లాట్ ఏరియా 1,567. అంటే ఫ్లాట్ విలువ రూ.42,30,900. ఇందులో 20 శాతం సొమ్మును కొనుగోలుదారులు చెల్లించారు. అంటే రూ.8,46,180. ఇప్పుడు ఆక్షన్‌లో చ.అ. రూ.3,300లకు అమ్ముడుపోయిందనుకుంటే.. ఫ్లాట్ విలువ 51,71,100 అవుతుంది. 20 శాతం సొమ్మంటే రూ.10,34,220. అంటే గతంలో చెల్లించిన దానికంటే రూ.1,88,040 లాభమన్నమాటేగా. ఇక కొనే వారికి చూస్తే.. ఇప్పుడక్కడ చ.అ. ధర రూ.3,700 ఉంది. అంటే ఫ్లాట్ విలువ 57,97,900 అవుతుంది. అంటే రూ.6,26,800 తక్కువకొచ్చిందన్నట్టేగా.

ఒకవేళ మీరు పెట్టిన ధరకు ఆక్షన్‌లో ఎవరూ కొనకపోతే గతంలో మీరు పెట్టిన సొమ్మును ఎలాంటి వడ్డీ, పెనాల్టీ లేకుండా పీడీసీ చెక్‌ను అక్కడికక్కడే సంస్థే ఇస్తుంది. మెగాపొలిస్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ప్రజయ్ సంస్థ హైదరాబాద్ నిర్మించే  ఏ ప్రాజెక్ట్‌లోనైనా 10 శాతం రాయితీని అందిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఫేజ్-1ని పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తాం. నిర్మాణం వేగవంతం చేసేందుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేశాం. నిర్మాణంలో నాణ్యత ఏమాత్రం తగ్గనివ్వం కూడా.

మరిన్ని వార్తలు