రుణం కోసం కనికట్టు.. దొంగ బంగారం తాకట్టు

19 Jan, 2016 03:23 IST|Sakshi

* రూ.82 లక్షల రుణం తీసుకున్న వైనం
* నిందితుడి అరెస్ట్

నల్లగొండ క్రైం: దొంగ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.82 లక్షలు రుణం తీసుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విక్రమ్‌జీత్‌దుగ్గల్ నిందితుడి వివరాలు వెల్లడించారు.. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ఆర్‌బీనగర్‌కు చెందిన తంగేళ్లపల్లి గిరిధరాచారి హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంకుల్లో అప్రైజర్(బంగారాన్ని నిర్ధారించే వ్యక్తి)గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయా బ్యాంకుల్లో 3 కిలోల 700 గ్రాముల దొంగ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.82 లక్షల, రూ.84 వేలను రుణంగా తీసుకున్నాడు.

అనంతరం అప్రైజర్ పని మానేశాడు. వార్షిక ఆడిట్‌లో భాగం గా అధికారులు దొంగ బంగారం గుట్టురట్టు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని రూ.7లక్షల 35వేల నగదు, కారు, యూనికాన్ బైకు స్వాధీనం చేసుకున్నారు. 49 మంది పేరిట దొంగ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం పొందినట్టు ఎస్పీ వివరించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు