టాటా గ్రూపులో మరో కీలక నియామకం

4 Jan, 2017 13:04 IST|Sakshi
టాటా గ్రూపులో మరో కీలక నియామకం

ముంబైటాటా -మిస్త్రీ బోర్డ్ వార్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా పవర్  ఛైర్మన్ గా ఎస్.పద్మనాభన్ నియమితులయ్యారు.  34 సంవత్సరాలుగా టాటా గ్రూప్ తో అనుబంధం ఉన్న పద్మనాభన్ ను ఈ కీలక పదవికి టాటా గ్రూపు  నామినేట్ చేసింది. ఈ  రోజునుంచే (జనవరి 4  2017) ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు  టాటా పవర్ ప్రకటించింది.  కంపెనీ  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్  సమావేశంలో టాటా పవర్  అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న  పద్మనాభన్ ను నామినేట్ చేసినట్టుగా  టాటా పవర్ బిఎస్ఇ ఫైలింగ్ లో  చెప్పింది.
కాగా గత డిసెంబర్ లో  పద్మనాభన్ ను టాటాపవర్  అదనపు డైరెక్టర్ నియమించింది.టాటా పవర్ బోర్డ్  లో చేరక మునుప ఆయన టాటా బిజినెస్ ఎక్స్లెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఉన్నారు.  మరోవైపు ఇటీవల టాటా సన్స్ గ్రూప్ హెచ్ ఆర్ హెడ్ అదనపు బాధ్యతను టాటా అప్పగించింది. సంగతి తెలిసిందే.  గత ఏడాది డిసెంబర్లో కంపెనీ డైరెక్టర్ గా  సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలింకింది టాటా గ్రూపు. అనంతర పరిణామాల నేపథ్యం, తన  పోరాటాన్ని మరింత ఉధృతం చేసే  యోచనలో టాటా గ్రూపులోని  ఆరు  లిస్టెడ్  కంపెనీలకు సైరస్ మిస్త్రీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు