పాకిస్తాన్‌కు ఒకే ఓవర్లో డబుల్ షాక్!

4 Jan, 2017 13:15 IST|Sakshi
పాకిస్తాన్‌కు ఒకే ఓవర్లో డబుల్ షాక్!

సిడ్నీ: పాకిస్తాన్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్‌ హజెల్ వుడ్ విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్ కు దిగిన పాక్‌కు నాలుగో ఓవర్లో షాకిచ్చాడు. ఆ ఓవర్లో ఓపెనర్ షార్జిల్ ఖాన్(4)ను, బాబర్ అజమ్‌(0) ను పేసర్ హజెల్ వుడ్ పెవిలియన్బాట పట్టించాడు. దీంతో 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాక్‌ను మరో ఓపెనర్ అజహర్ అలీ, యూనిస్ ఖాన్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. అజహర్ అలీ(123 బంతుల్లో 58 నాటౌట్: 5 ఫోర్లు), వెటరన్ ప్లేయర్ యూనిస్ ఖాన్ (112 బంతుల్లో 64 నాటౌట్: 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ 538/8 కి డిక్లేర్ చేసింది.

ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హ్యండ్స్‌కోంబ్‌ సెంచరీ(215 బంతుల్లో 110, 9 ఫోర్లు) సాధించాడు. మరోవైపు మాట్‌ రెన్‌షా (293 బంతుల్లో 184 ‌; 20 ఫోర్లు) కెరీర్‌లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలచలేకపోయాడు. రెన్‌షా, హ్యాండ్స్‌కోంబ్, వార్నర్(113) సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 538/8 కి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. హ్యాండ్స్‌కోంబ్‌కు కార్ట్ రైట్(37), కీపర్ మాథ్యూ వేడ్(29) నుంచి సహకారం లభించింది. స్టార్క్(16) ఔట్ అయ్యాక కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించాడు. ఇతర బౌలర్లలో ఇమ్రాన్ ఖాన్, అజహర్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు