ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు

16 Aug, 2016 09:59 IST|Sakshi

ముంబై : దేశీయ మార్కెట్లు మంగళవారం నాటి ట్రేడింగ్లో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 29.26పాయింట్ల స్వల్ప లాభంతో 28,181 వద్ద నిఫ్టీ 2.35 పాయింట్ల లాభంతో 8,674 దగ్గర  ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్, రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాట్లాండ్ భారీ ప్రాజెక్టును కోల్పోవడంతో కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ముందటి క్లోజింగ్కు 2 శాతం డౌనవుతూ.. ఇన్ఫోసిస్ షేర్ ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ మార్కెట్లు సైతం పడిపోతున్నాయి. ఐటీసీ, పవర్గ్రిడ్లు లాభాల్లో నడుస్తున్నాయి.

శుక్రవారం ముగింపుకు కొంత బలపడి రూపాయి ఓపెన్ అయింది. ప్రస్తుతం డాలర్ మారకం విలువతో పోలిస్తే రూపాయి 0.04 పైసలు బలపడి 66.81గా ఉంది.  నిఫ్టీ50 ఒత్తిడిలో ఉన్నప్పటికీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్  మద్దతుతో తన కీలకమైన మార్కు 8650కు పైననే ట్రేడ్ అవుతోంది. వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ, పారిశ్రామికోత్పత్తి డేటా నేడు మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తున్నాయని, అదేవిధంగా గ్లోబల్ డెవలప్మెంట్లు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. కాగ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా స్టాక్ మార్కెట్లు సెలవును పాటించాయి.

మరిన్ని వార్తలు