ఐటీ దెబ్బ, ఫార్మా మద్దతు

8 Sep, 2016 16:11 IST|Sakshi

ముంబై: దేశీ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.  సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో  29,045  వద్ద, నిఫ్టీ పాయింట్ల 35  లాభంతో 8,952. దగ్గర ముగిశాయి. నిప్టీ, సెన్సెక్స్ రెండూ  కీలక మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ముగిశాయి.  దీంతోపాటు   సెన్సెక్స్ 18 నెలల గరిష్టాన్ని తాకింది. ప్రధానంగా  ఐటీసీ, సన్ ఫార్మ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి  భారీ లాభాలతో టాప్ విన్నర్స్ గా నిలిచాయి. అలాగే టీసీఎస్ ప్రకటనతో ఐటీ రంగ దిగ్గజ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.  టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర నష్టపోయాయి.
ప్రారంభంలో నష్టాల్లో ఊగిసలాడిన  మార్కెట్లలో మదుపర్లు  ఫార్మా రంగంలో కొనుగోళ్లపై మళ్లారు.  దీంతో  బ్లూచిప్‌ షేర్లు సన్‌ ఫార్మా, క్యాడిలా, సిప్లా, గ్లెన్‌మార్క్‌, అరబిందో, లుపిన్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, దివీస్‌ బాగా లాభపడ్డాయి.  ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి పలు కంపెనీల ప్లాంట్లకు ఈఐఆర్‌(క్లీన్‌చిట్‌) లభిస్తుండటం, వివిధ విభాగాలలో ఔషధాలకు అనుమతులు పొందుతుండటం, క్యూ1లో పలు కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించడం వంటి అంశాలు ఈ రంగానికి జోష్‌ నిచ్చిందని  విశ్లేషకులు అంచనావేశారు.

అటు కరెన్సీ మార్కెట్లోడాలర్ తోపోలిస్తే  రూపాయి0.04 నష్టంతో 66.41 వద్ద ఉంది.  ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి జోరు సాగింది. పది గ్రా.పుత్తడి 45 రూపాయలుఎగిసి 31,350 దగ్గర ఉంది.

 

మరిన్ని వార్తలు