ఫెడ్ అంచనాలతో స్టాక్ మార్కెట్లు ఢమాల్

13 Oct, 2016 15:04 IST|Sakshi
ఫెడ్ అంచనాలతో స్టాక్ మార్కెట్లు ఢమాల్

ముంబై: రెండు రోజుల విరామం తర్వాత నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. దలాల్ స్ట్రీట్ లో అమ్మకాల  ఒత్తిడితో సెన్సెక్స్ ఒక దశలో 440 పాయింట్లకు పైగా నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పతనమైంది. ఆరంభంనుంచీ బలహీనంగా ఉన్నమార్కెట్లు ఫెడ్ అధిక వడ్డీ రేట్లు అంచనాలు,  యూరప్ మార్కెట్లనుంచి ప్రతికూల సంకేతాలతో  మరింత కుప్పకూలాయి.  పుత్సి 55, కాక్‌ 59, డాక్స్‌ 136 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోన్నాయి.
ప్రపంచమార్కెట్ల బలహీనత, కీలక కంపెల ఆర్థిక ఫలితాలు ముందుండటంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాలను చవి చూస్తున్నాయి.  నిఫ్టీ ప్రధాన షేర్లలో 6 మినహా అన్నీ  నెగిటివ్‌గా ఉన్నాయి.  అటు  బ్యాంక్‌ నిఫ్టీ కీలక స్థాయి 19వేల దిగువకు పడిపోయింది. మిడ్‌ క్యాప్‌ , స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి భారీగా  నెలకొంది. కెనరా బ్యాంక్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సన్‌ టీవీలు   నష్టపోతున్నాయి. టొరెంట్‌ పవర్‌, రిలయన్స్‌ పవర్‌, అదాని పవర్‌, టాటా పవర్‌, గ్లెన్‌ మార్క్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జీఈ టిఅండ్‌డి ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌, నాల్కో, ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, బ్లూడార్ట్‌, యూనియన్‌ బ్యాంక్‌, టాటా గ్లోబల్‌ బేవరీస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, కోల్గేట్‌, సెయిల్‌  షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అటు రూపాయి విలువ మరింత  బలహీనత పడింది.  39పైసల నష్టంతో రూ 66.93  దగ్గరుంది.
 

>
మరిన్ని వార్తలు