ఒత్తిడిలో ఐటీ స్టాక్స్: అటూఇటుగా మార్కెట్లు

9 Jan, 2017 10:02 IST|Sakshi
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఐటీ స్టాక్స్లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకుల్లో సాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభనష్టాల ఊగిసలాటలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ స్వల్పంగా 4.49 పాయింట్ల లాభంలో 26,763 వద్ద, నిఫ్టీ 4.72 లాభంలో 8,248 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 93.34 పాయింట్ల లాభంలో, నిఫ్టీ 15.65 పాయింట్ల లాభంలో ఎంట్రీ ఇచ్చాయి. కానీ వరుసగా రెండో రోజు కూడా ఐటీ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగుతుండటంతో  మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ కంపెనీలు 0.5 శాతం నుంచి 1 శాతం మేర పడిపోతున్నాయి.
 
హెచ్-1బీ వీసీ ప్రొగ్రామ్లో కీలక మార్పులను ఉద్దేశిస్తూ రూపొందిన బిల్లును యూఎస్ కాంగ్రెస్లో మళ్లీ ప్రవేశపెడటంతో, వీసా భయాందోళనతో ఐటీ కంపెనీలు నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే.  ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత అవుట్సోర్సర్ల ఆపరేటింగ్ మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపనుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. నిఫ్టీ అన్నీ స్టాక్స్లో అరబిందో ఫార్మా మంచి లాభాలనార్జిస్తూ 3 శాతం పైకి ఎగిసింది. పోర్చుగల్ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్ ఔషధ కంపెనీ జనరిస్ ఫార్మాస్యూటికాను అరబిందో సొంతం చేసుకోవడంతో కంపెనీపై సానుకూల ప్రభావం వ్యక్తమవుతోంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.20 పైసల నష్టంతో 68.20గా ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 55 రూపాయల నష్టంతో 27,893గా ఉంది.  
 
మరిన్ని వార్తలు