విస్తారాలో భారీ పెట్టుబడులు

13 May, 2017 18:24 IST|Sakshi

టాటా-సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎయిర్‌లైన్స్‌ సంస్థ 'విస్తారా'లో సింగపూర్‌ఎయిర్‌లైన్స్‌ భారీ పెట్టుబడులు   పెట్టేందుకు  సిద్ధమైంది. దాదాపు 100 మిలియన్లకు పైగా సింగపూర్‌ డాలర్లను ఇన్వెస్ట్‌చేయనుంది. విస్తారా  పనితీరుపట్ల ఆకర్షితమై అనుకున్నదానికి కంటే దాదాపు  రెట్టింపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే  పెట్టుబడులను ధృవీకరించిన ఎస్‌ఏఐ ఎంత పెద్దమొత్తంలో అనేది వెల్లడించడానికి మాత్రం నిరాకరించింది. కమర్షియల్ కాన్ఫిడెన్సియల్‌ అని తెలిపింది. న్యూఢిల్లీ-ఆధారిత క్యారియర్ 2020వరకు లాభాలను ఆశించకపోయినప్పటికీ రెండు సంవత్సరాలకు పైగా దేశీయంగా  సేవలందిస్తూ మంచి గ్రోత్‌ను సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

తమ ప్రాంతీయ క్యారియర్‌ సిల్క్‌ ఎయిర్‌ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు విస్తారాతోభాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా   సింగపూర్‌క స్టమర్‌ సింగపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి  టికెట్‌ బుక్ చేసుకోవడానికి, అక్కడినుంచి 10 దేశీయ గమ్యస్థానాలకు విస్తారా ద్వారా బుక్‌ చేసుకునే సౌలభ్యం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ గురించి ఎక్కువ అవగాహనను విస్తరించడంలో ఈ ఒప్పందం కీలక  ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, తమ అంతర్జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని విస్తారా ప్రతినిధి  తెలిపారు.
 
ఇప్పటికే విస్తారాలో ఎస్‌ఏఐ 49శాతం వాటాను కలిగిఉంది.  వచ్చే ఏడాది జూన్‌నాటికి  విస్టారా దాని 20 వ విమానం కొనుగోలుతో ముఖ్యమైన మైలురాయిని తాకుతుందని,   అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి వైమానిక మార్గాలను సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

జాయింట్ వెంచర్ వైమానిక సంస్థలో టాటా గ్రూప్  51 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం 45 దేశీయ రూట్లలో13 విమానాలను విస్తారా కలిగింది.  భారత పౌరవిమానయాన నియమాల ప్రకారం, ఇంర్నేషనల్‌  సేవలందించలంటే విస్టారాకు కనీసం 20 విమానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో సుమారు 50 వైడ్‌ బాడీస్‌ సహా 100 విమానాలను కొనుగోలు ప్రణాళికలోఉన్నట్టు సమాచారం. అయితేఈ వార్తలను విస్తారా కొట్టిపారేసింది.  టఫ్ ఆపరేటింగ్‌ వాతావరణం ఉన్నప్పటికీ ఇండియన్‌ మార్కెట్‌ విస్తరించాలనేప్రణాళికలను పదేపదే ఎస్‌ఐఏ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
 కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్ ప్రకారం ప్రపంచంలో  మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌ గా భారతదేశం ఉంది.

 

మరిన్ని వార్తలు