'సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలి'

27 Jul, 2015 14:54 IST|Sakshi
'సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలి'

న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇండియా- పాకిస్థాన్ సరిహద్దు వెంట అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ డీజీ డీకే పాథక్ తో ఆదేశించినట్టు ట్విటర్ లో పేర్కొన్నారు. పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్,  హోంశాఖ, ఎన్ఎస్ఏ కార్యదర్శులతో మాట్లాడానని చెప్పారు. గురుదాస్ పూర్, పంజాబ్ లో పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామన్నారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తూనీగ’ డైలాగ్ పోస్ట‌ర్ల‌ విడుదల

‘‘డియర్‌ కామ్రేడ్‌’ విజయం సంతోషాన్నిచ్చింది’

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?