చెన్నైలో ఉద్రిక్తత.. మేమున్నామంటూ!

10 Apr, 2017 12:40 IST|Sakshi
చెన్నైలో ఉద్రిక్తత.. మేమున్నామంటూ!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్ధితిపై ఆందోళనలు నెలకొనడంతో రాజధాని చెన్నైలో రోడ్లపై వాహనాల జాడ కనిపించడం లేదు. నగరంలో ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఎలాంటి వసతి లేక అవస్ధలు పడుతున్న వారికి సాయం చేసేందుకు ఓ వాలంటీర్ల బృందం ముందుకొచ్చింది.
 
బసిత్, బాలాజీ ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు వాలంటీర్లు నగరంలో ఎవరైనా ఎమర్జెన్సీని ఎదుర్కొన్నా, అత్యవసరంగా ప్రయాణించాల్సివున్నా తమను సంప్రదించాలంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశారు. వీరు ఇరువురు చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరికైనా అత్యవసరమైన పరిస్ధితి ఉంటే వారి లొకేషన్ ను వాట్సాప్ ద్వారాగాని, ఎస్ఎంఎస్ ద్వారాగాని తమకు పంపింతే.. సాయం అందించడానికి ప్రయత్నిస్తామని వారు పోస్టులో పేర్కొన్నారు.
 
అవది, పొరూర్, చ్రోమేపేట్, తాంబరం, పాది-అంబత్తూర్లలో ఇప్పటికే 18మంది వాలంటీర్లు అత్యవసర పరిస్ధితి ఎదుర్కొంటున్నవారికి సాయం అందిస్తూ.. మరింత మంది వాలంటీర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు