టీ-న్యూస్, నమస్తే తెలంగాణలపై ఫిర్యాదు

15 Nov, 2015 22:52 IST|Sakshi
టీ-న్యూస్, నమస్తే తెలంగాణలపై ఫిర్యాదు

వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన టీ న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ పత్రికలపై కేసు నమోదు చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కరుణకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఫిర్యాదును టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మార్క విజయకుమార్‌గౌడ్‌లు రేవంత్‌రెడ్డి తరఫున అందించారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా సదరు చానల్‌లో ప్రసారాలు, పత్రికల్లో ప్రత్యేక కథనాలు రూపొందించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రసారాలు, ఆర్టికల్స్‌ను పెరుుడ్ న్యూస్‌గా పరిగణించాలని కోరారు. వరంగల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీకి వీసీని నియమించడం, క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, అధికారంగా పండుగ నిర్వహించాలని ఆదేశాలు, పోలీస్ ఉద్యోగాలకు మూడేళ్ల వయసు సడలింపు నిర్ణయాలు, టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ వంటివన్నీ కోడ్‌కు విరద్ధమని రేవంత్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు