ట్రింగ్ ట్రింగ్ @ 90.45 కోట్లు

14 Dec, 2013 03:29 IST|Sakshi
ట్రింగ్ ట్రింగ్ @ 90.45 కోట్లు

 న్యూఢిల్లీ: టెలికం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగిందని నియంత్రణ సంస్థ ట్రాయ్ శుక్రవారం తెలిపింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం..,
 

  •      ఈ ఏడాది సెప్టెంబర్‌లో 89.98 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్‌లో 90.45 కోట్లకు పెరిగింది. వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 87 కోట్ల నుంచి 0.56 శాతం వృద్ధితో 87,54 కోట్లకు పెరిగింది.
  •   మొత్తం మొబైల్ యూజర్లలో 85% మంది యాక్టివ్ యూజర్లు.
  •   పట్టణ ప్రాంత వెర్లైస్ వినియోగదారుల వాటా 59.75 శాతం నుంచి 59.65 శాతానికి తగ్గింది. మరోవైపు గ్రామీణ ప్రాంత వెర్లైస్ వినియోగదారుల వాటా మాత్రం 40.25 శాతం నుంచి 40.35 శాతానికి పెరిగింది.  సెప్టెంబర్‌లో 73.01గా ఉన్న టెలీడెన్సిటీ అక్టోబర్‌లో 73.32 శాతానికి పెరిగింది.
  •   అక్టోబర్ చివరినాటికి దేశంలో 1.49 కోట్ల మంది బ్రాడ్‌బాండ్ వినియోగదారులున్నారు.
  •   అక్టోబర్‌లో నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 23 లక్షలు. దీంతో ఇప్పటివరకూ ఎంఎన్‌పీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 10.48 కోట్లకు పెరిగింది.
  •      కొత్త వినియోగదారులు అక్టోబర్‌లో ఎయిర్‌టెల్(14.88 లక్షలు)కే అధికంగా లభించారు. తర్వాత స్థానాల్లో వొడాఫోన్(11.51 లక్షలు), ఐడియా(11.49 లక్షలు) ఉన్నాయి
  •      ఎంటీఎన్‌ఎల్ 1.55 లక్షలు, టాటా టెలీ 96,500 మంది వినియోగదారులను కోల్పోయాయి.
     

మరిన్ని వార్తలు