లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్

16 Sep, 2015 18:36 IST|Sakshi
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్

లిబియాలో మరో ఇద్దరు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. ఇప్పటికీ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఐఎస్ తీవ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్  లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. 

 

గత జులై 31న ఇదే సిర్తే పట్టణంలో నలుగురు భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లు క్షేమంగా తిరిగిరాగా, తెలుగువారైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామ్ లు ఇంకా బందీలుగానే ఉన్నారు. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు చేస్తున్నది.

>
మరిన్ని వార్తలు