అభివృద్ధి అసమానం

22 Mar, 2017 02:10 IST|Sakshi

స్టాక్‌హోం: గత పాతికేళ్లలో మానవుడు పలు రంగాల్లో ఎంతో పురోగతి సాధించినా శరణార్థులు, వలసదారులు, మహిళలు ఇంకా వెనకబడి ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది. ‘ప్రజలు ఇప్పుడు సుదీర్ఘ కాలం జీవిస్తున్నారు. చాలా మందికి కనీస వసతులన్నీ అందుబాటులోకి వచ్చాయి.

 అయినా మానవాభివృద్ధి అసమానంగా ఉంది’ అని స్టాక్‌హోంలో విడదలైన ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) నివేదిక నిగ్గుతేల్చింది. 1990–2015 మధ్య ప్రపంచ జనాభా 200 కోట్లు పెరిగిందని, 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. 210 కోట్ల మందికి మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చిందని, 260 కోట్ల మంది సురక్షిత నీటిని పొందుతున్నారని తెలిపింది. 1 శాతం జనాభా చేతిలోనే 46 శాతం సంపద ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు