'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత'

12 Oct, 2015 17:30 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమింపజేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని కాంగ్రెస్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మధు యాష్కీ అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు లోక్సభను స్తంభింపజేసినపుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతిచ్చారని మధు యాష్కీ చెప్పారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, 10 ఏళ్లు కావాలని కోరిన బీజేపీ పెద్దలు.. ఇప్పుడు ఆ అంశాన్ని విస్మరించడం సరికాదని అన్నారు.

మరిన్ని వార్తలు