ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం

15 Feb, 2014 03:06 IST|Sakshi
ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేసియాలో ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో ఒకటైన జావాలోని మౌంట్ కెలూద్ గురువారం రాత్రి బద్దలైంది.  ఆ సమయంలో శబ్దం 200 కిలోమీటర్ల వరకు వినిపించిందని విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది. బూడిద, శకలాలు 18 కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

యోగకర్త, మలంగ్, సోలో సహా ఏడు విమానాశ్రయాలను మూసివేశారు. తామైతే యుగాంతం అని భయపడినట్లు స్థానికుడు రత్నో ప్రమోనో(35) అనుభవాన్ని వివరించారు. బూడిద, చిన్న రాళ్లు సురభ్య పట్టణం సహా సమీప ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున పడిపోయాయి. యోగకర్త పట్టణాన్ని బూడిద కప్పేయడంతో శుక్రవారం పగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండోనేసియాలోని పలు ప్రాంతాలకు వర్జిన్ ఆస్ట్రేలియా విమాన సర్వీసులను రద్ధు చేసుకుంది. బూడిదలో చిక్కుకున్న వారిని మలంగ్ పట్టణంలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం.
 

మరిన్ని వార్తలు