తాగింది దిగాలంటే..!

10 May, 2015 12:45 IST|Sakshi
తాగింది దిగాలంటే..!

న్యూయార్క్: అలసటతోకావచ్చు.. ఆనందానికి కావచ్చు.. చిరాకుతో కావచ్చు.. విరక్తితో కావచ్చు.. ఏ కారంణంతో రాత్రంతా పీకలదాకా తాగి పడుకున్నా.. దానివల్ల పొద్దున్నే తలెత్తే హ్యాంగోవర్ నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం కొన్ని ఆహార నియమనిబంధనలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. లేదంటే వికారంగా ఉండి జీర్ణ వ్యవస్థ కుదురుకోక ఓ వారం రోజులపాటు అలసట తలెత్తి.. చిరాకుతో చిర్రెత్తిపోయి.. ఏకాగ్రత మొత్తం పాడై పోతుందని వారు చెప్తున్నారు.
హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ఏంచేయాలి..

  • బెడ్పైనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి
  • ఆరెంజ్ జ్యూస్ జీర్ణాశయానికి ఆ సమయంలో చాలా మంచిది.
  • ఆ రోజు సాధారణంగా కేలరీలు ఎక్కువ అవసరం అని చాలామంది సాండ్ విచ్ తీసుకుంటారు.. కానీ అలాంటి వాటికి బదులు గ్రుడ్లు తినాలి.
  • కాఫీ హ్యాంగోవర్ను ఎక్కువ చేస్తుంది.. అందుకే దీనికి బదులు ఎక్కువ మొత్తంలో నీళ్లుగాని, హెర్బల్ టీగానీ తాగాలి.
  • గ్రే ఫుడ్ తీసుకోవాలి.
  • మాంసం కొంచెం తినొచ్చుగానీ.. పూర్తి స్థాయిలో తినకూడదు.
  • హ్యాంగోవర్ పోవడానికి చాలామంది మరింత ఆల్కహాల్ తాగుతారు. కానీ దీనివల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. అది మంచిది కాదు.

మరిన్ని వార్తలు