-
ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి
ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న కోవిడ్ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్టెక్లు తెలిపాయి. భారత్‌లో రికవరీ రేటు 92.89% భారత్‌లో కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో 47,905 బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,916కు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.89% శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం పేర్కొంది. అదేవిధంగా, ఈ వ్యాధితో 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 550 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 1,28,121గా నమోదైంది. కోవిడ్ టీకా పరిశోధనలకు రూ.900 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కోవిడ్ సురక్ష మిషన్ కోసం ఈ నిధులను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని పంపణీ కోసం వేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. -
తాగింది దిగాలంటే..!
న్యూయార్క్: అలసటతోకావచ్చు.. ఆనందానికి కావచ్చు.. చిరాకుతో కావచ్చు.. విరక్తితో కావచ్చు.. ఏ కారంణంతో రాత్రంతా పీకలదాకా తాగి పడుకున్నా.. దానివల్ల పొద్దున్నే తలెత్తే హ్యాంగోవర్ నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం కొన్ని ఆహార నియమనిబంధనలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. లేదంటే వికారంగా ఉండి జీర్ణ వ్యవస్థ కుదురుకోక ఓ వారం రోజులపాటు అలసట తలెత్తి.. చిరాకుతో చిర్రెత్తిపోయి.. ఏకాగ్రత మొత్తం పాడై పోతుందని వారు చెప్తున్నారు. హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ఏంచేయాలి.. బెడ్‌పైనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ జీర్ణాశయానికి ఆ సమయంలో చాలా మంచిది. ఆ రోజు సాధారణంగా కేలరీలు ఎక్కువ అవసరం అని చాలామంది సాండ్ విచ్ తీసుకుంటారు.. కానీ అలాంటి వాటికి బదులు గ్రుడ్లు తినాలి. కాఫీ హ్యాంగోవర్‌ను ఎక్కువ చేస్తుంది.. అందుకే దీనికి బదులు ఎక్కువ మొత్తంలో నీళ్లుగాని, హెర్బల్ టీగానీ తాగాలి. గ్రే ఫుడ్ తీసుకోవాలి. మాంసం కొంచెం తినొచ్చుగానీ.. పూర్తి స్థాయిలో తినకూడదు. హ్యాంగోవర్ పోవడానికి చాలామంది మరింత ఆల్కహాల్ తాగుతారు. కానీ దీనివల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. అది మంచిది కాదు. -
ఆ......రోజుల్లోనే!
‘హ్యాంగోవర్గా ఉంది’ అని మత్తు మత్తుగా అనగానే కుప్పలు తెప్పలుగా సలహాలు వచ్చిపడతాయి. ఆధునిక వైద్యం పుణ్యమా అని పరిష్కార మార్గాలు కూడా ఎన్నో దొరుకుతాయి. కానీ, 1,900ల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్‌లో హ్యాంగోవర్‌ను దించే పరిష్కారాలు లోకానికి తెలియజేశారు వైద్యులు. మందు ఎక్కువై శిరోభారానికి గురి కావడం, ఆకలిగా అనిపించకపోవడం, కళ్లు తిరగడం... మొదలైన సమస్యలకు పరిష్కార మార్గాలు, మందులకు సంబంధించి గ్రీకులో రాయబడిన ఆధారాలను కైరోలో కనుగొన్నారు. ‘‘హ్యాంగోవర్‌ను తగ్గించడానికి రకరకాల పరిష్కార మార్గాలు ఆరోజుల్లోనే కనుక్కోవడం ఆశ్చర్యం కలిగించే విషయం’’ అంటున్నాడు యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కు చెందిన చరిత్రకారుడు ప్రొఫెసర్ వివియన్ నటన్. వాడిపోయిన గులాబీలు, వాననీటితో కూడా హ్యాంగోవర్‌ను ఎలా తగ్గించవచ్చో వైద్యులు సూచించారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement