నాలుగేళ్ల నుంచి ఏంచేస్తున్నారు: పంకజ

23 Nov, 2013 21:28 IST|Sakshi

ముంబై: తదుపరి పార్లమెంట్ సమావే శాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందంటూ ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే పంకజాముండే పాల్వే మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాల నుంచి పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పవార్ ప్రకటన అర్ధరహితమన్నారు.ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడం అధికార పార్టీలకు సులువేనన్నారు.

 

అసలు ఈ అంశాన్ని ఇన్నేళ్లుగా ఎందుకు లేవనెత్తలేదన్నారు. కాగా నగరంలో శుక్రవారం జరిగిన ఎన్సీపీ మిహ ళా విభాగం సమావేశంలో ఈ అంశాన్ని పవార్ ప్రస్తావించారు. ఈ విషయమై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలతో మాట్లాడానని ఆయన పేర్కొన్న సంగతి విదితమే.
 

>
మరిన్ని వార్తలు