వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌

24 Jul, 2017 16:20 IST|Sakshi
వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహన్‌ తాజాగా కలెక్టర్లకు ఘాటు వార్నింగ్‌ ఇచ్చారు. రెవెన్యూ కేసులను నెలలోపే విచారించాలని, నెల గడిచినా ఏదైనా రెవెన్యూ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిస్తే.. ఆ కేసుకు సంబంధించిన రెవెన్యూ అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానని హెచ్చరించారు. భోపాల్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ ఫిర్యాదుల అంశాన్ని బీజేపీ నేతలు లేవనెత్తారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎంను కోరారు.

దీంతో ఈ సమావేశంలో సీఎం చౌహాన్‌ ఈమేరకు అధికారులకు తీవ్రమైన హెచ్చరిక చేసినట్టు తెలిసింది. నవంబర్‌ నెలలో సీఎం చౌహాన్‌ తాను అధికారంలోకి వచ్చి 12 ఏళ్ల పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అప్పటిలోగా రెవెన్యూ కేసులను నిర్దిష్ట గడువుతో పరిష్కరించకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అయితే, మరోవైపు కలెక్టర్లపై ముఖ్యమంత్రి అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు