ఆ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఒత్తిడి ఎక్కువ

26 Aug, 2015 08:09 IST|Sakshi
ఆ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఒత్తిడి ఎక్కువ

న్యూయార్క్: ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఎవరికైనా పనిలో ఒత్తిడి సర్వసాధారణం. ముఖ్యంగా ఒక పక్కన ఇంటిని, పిల్లలను చక్కబెట్టుకుంటూ మరో పక్క వృత్తి బాధ్యతలు నిర్వహించే మహిళలపై సహజంగానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఆడవాళ్లు ఒత్తిడికి లోనవడానికి మరో కొత్త కారణాన్ని వెల్లడించారు న్యూయార్క్ పరిశోధకులు. పురుషాధిక్యంతో నడిచే సంస్థలు, వృత్తుల్లో పనిచేసే మహిళలు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అన్నారు.
 
 ఏళ్ల తరబడి ఇదే పరిస్థితుల్లో పనిచేయడం వల్ల చివరికి వాళ్ల మనసులో తాము బలహీనులమని భావించే రుగ్మతకు లోనవుతున్నారని ‘ఇండియన్ యూనివర్సిటీ’కి చెందిన మనాగో చెప్పారు. 85 శాతం కంటే ఎక్కువ మంది పురుషులు సహోద్యులుగా ఉన్న సంస్థల్లో పనిచేసే స్త్రీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో పనిచేసే మహిళలు.. ఒంటిరితనం, పనితీరు, లైంగిక వేధింపులు, చిన్నచూపు చూడటం, తగిన ప్రోత్సాహం లేకపోవడం.. వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.

>
మరిన్ని వార్తలు