అతిసన్నని గింజ.. అన్నమెంతో నాణ్యం!

26 May, 2014 00:25 IST|Sakshi
అతిసన్నని గింజ.. అన్నమెంతో నాణ్యం!

 ‘సాగుబడి’ 19-5-2014 సంచికలో ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం వరి విభాగం రూపొందించిన ఆర్‌ఎన్‌ఆర్ 15048 గురించి ప్రచురించిన కథనం చదవి మన రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి రైతు సోదరులు అమితాసక్తిని చూపారు. ఈ నేపథ్యంలో వరి విభాగం శాస్త్రవేత్తలను ‘సాగుబడి’ సంప్రదించగా.. గత ఖరీఫ్‌లో ఈ పంటను సాగు చేసి రైతువారీ విత్తనాన్ని తయారు చేసుకున్న పలువురు రైతుల వివరాలను అందించారు.

ఆసక్తి గల రైతులు విత్తనం కోసం ఈ రైతులను సంప్రదించవచ్చు: టి. ప్రసాద్(కర్నూలు జిల్లా) - 9550082333, సత్యనారాయణ(కరీంనగర్ జిల్లా)- 9908608696, పుల్లారావు (కరీంనగర్ జిల్లా)- 9959420390, బాల్‌రెడ్డి (మెదక్ జిల్లా)- 9912989934, భాస్కర్‌రెడ్డి(మెదక్ జిల్లా)-9989625236, కర్రావుల శ్రీనివాస్‌రావు(నల్లగొండ జిల్లా)- 9640642002. జానార్దన్‌రెడ్డి(నల్లగొండ జిల్లా)  - 9393685123, శర్మ (మహబూబ్‌నగర్ జిల్లా)- 9441303150, సుదర్శన్ రెడ్డి (మహబూబ్‌నగర్ జిల్లా)- 9989625228, సయ్యద్‌పాషా(నిజమాబాద్ జిల్లా)- 9652465272, నాగేశ్వరరావ్  (సిందనూర్, కర్నాటక)- 09740029979.
 
 తక్కువ నత్రజనితో దిగుబడి అధికం!
 ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంగడం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించి మార్గదర్శకత్వం నిర్వహించిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేంద్రరాజు రైతు సోదరులు పాటించాల్సిన మెలకువలను అందిస్తున్నారు. ‘సన్న గింజ రకాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రాజేంద్రనగర్ వరి విభాగం కొన్ని సంవత్సరాలుగా కృషి చేసి 15048 రకాన్ని రైతులకు అందిస్తోంది. ఇది ఎంటీయూ 1010కి దాదాపు సమానమైన దిగుబడి ఇస్తోంది. తక్కువ కాలంలో అతి నాణ్యమైన అధిక దిగుబడి రైతుకు అందుతోంది. ఖరీఫ్ అనగానే సన్నగింజ రకమైన సాంబమసూరి 5204 విత్తనాలు వెతుక్కోవడం పరిపాటైంది. ఇది దీర్ఘకాలిక రకం కనుక రోహిణీ కార్తె నుంచే నార్లు పోసుకోవడం మొదలవుతుంది. ఆలస్యంగా నార్లు పోసుకున్నట్లయితే నాట్లు ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. ఆర్‌ఎన్‌ఆర్ 15048 స్వల్పకాలిక రకం కనుక జూలైలో నార్లు పోసుకోవడానికి చాలా అనుకూలమైనది.
 
 ఇది తక్కువ కాలపరిమితిగల వంగడమే కాకుండా అగ్గి తె గులును తట్టుకొని మనగలుగుతుంది. ఈ వంగడాన్ని జూన్ కంటే జూలైలో నాట్లు వేసుకుంటే మంచిది. అలాగే నత్రజని ఎరువు సాధారణం కంటే  25 శాతం తగ్గించినప్పుడు మంచి దిగుబడులు నమోదయ్యాయి. సిఫారసు చేసిన దానికి మించి నత్రజని వాడినప్పుడు వరి మరింత ఎత్తు పెరిగి పడిపోయే అవకాశాలెక్కువ. కాండం తొలిచే పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దోమపోటు రాకుండా కాలిబాటలు తీసుకోవాలి. పంటను గమనిస్తూ పురుగు ఉనికిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోగలిగితే మంచి దిగుబడి రైతుల సొంతం’ అని డాక్టర్ సురేంద్రరాజు(98490 59297, ఞటటజీఛ్ఛి2009ః జఝ్చజీ.ఛిౌఝ) వివరించారు. రైతు సోదరులు సందేహాలుంటే 040-24015817 ఫోన్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.                    - ‘సాగుబడి’ డెస్క్

మరిన్ని వార్తలు