ఐటీడీఏ ఎదుట అంగన్‌వాడీల ఆందోళన | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ఎదుట అంగన్‌వాడీల ఆందోళన

Published Tue, Sep 12 2023 12:30 AM

సమ్మెలో కూర్చున్న అంగన్‌వాడీలు
 - Sakshi

ఉట్నూర్‌రూరల్‌: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్‌వాడీ ఉద్యోగులు ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెన్షన్‌ ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని, ప్రమాద బీమా రూ.5 లక్షలు చెల్లించాలని, ఎస్‌ఎస్‌సీ అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్‌ కల్పించాలని, జీపీఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి రత్నమాల, ముక్త, పద్మ, సంగీత, కవిత, లక్ష్మి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టడంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు తొలగించి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారుల సమక్షంలో కేంద్రాల్లో నిలువ ఉన్న గుడ్లు, పప్పు తదితర సరుకుల వివరాలను నమోదు చేసుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.

Advertisement
Advertisement