మన పండరీపురం.. | Sakshi
Sakshi News home page

మన పండరీపురం..

Published Sun, Nov 26 2023 12:10 AM

ఆలయ ముఖద్వారం  - Sakshi

● విఠలేశ్వర జాతరకు ఏర్పాట్లు పూర్తి ● ఆలయంలో నెలరోజులుగా కొనసాగుతున్న ఉత్సవాలు ● నేటి నుంచి తానూరులో జాతర ● తరలిరానున్న భక్తులు ● మల్లయోధులకు కుస్తీపోటీలు

తానూరు: మహారాష్ట్రలోని పండరపురం విఠలేశ్వర ఆలయంలో జరిగే కార్యక్రమాలు కార్తీక మాసంలో ఇక్కడి తానూరులోని విఠలేశ్వర ఆలయంలో కొనసాగుతాయి. ఈసారి సైతం ఆలయ కమిటీ సభ్యులు జాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. ఆది, సోమవారాల్లో విఠలేశ్వరుని ఆలయంలో జరిగే జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ ఏడాదితో 105ఏళ్లు పూర్తికావడంతో ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

పల్లకి ఊరేగింపులు..

ఆలయంలో కార్తీక మాసంలో మొదటి ఏకాదశి నుంచి ఇక్కడ వేడుకలు ప్రారంభం కావడంతో పల్లకి ఊరేగింపు కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. విఠలేశ్వర మాలధారులు ఆలయంలో నిత్యం భజనలు చేస్తున్నారు. స్వామి వారికి సాయం, సంధ్య వేళల్లో ప్రత్యేక మంగళహారతులు ఇస్తున్నారు.

స్వామివారి రథం ఊరేగింపు...

విఠలేశ్వర స్వామి వారికి ఏటా జాతర సందర్భంగా కార్తీక చతుర్థి పౌర్ణిమి ఆదివారం రాత్రి 12గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ పూజారి పింటు మహరాజ్‌ తెలిపారు. రథాన్ని గ్రామస్తులు, భక్తులు తాళ్లతో లాగుతూ ప్రధాన వీధుల ఉ ండా ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. ర థాన్ని లాగితే మస్సులో మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. అ యితే కార్తీక మాసం నెల రోజులుగా మహా రాష్ట్రలోని పండరపురంలోని విఠలేశ్వరుని ఆలయంలో నిర్వహించే భక్తి కార్యక్రమాలు తానూర్‌లోని ఆలయంలో నిర్వహిస్తారు. దీంతో ఇక్కడి ప్రజ లు మరో పండరపురం తానూరుగా భావిస్తారు.

హరినామ సప్తాహం ...

ఈ ఏడాదితో జాతరకు 105 ఏళ్లు పూర్తికాడంతో ఆలయ కమిటీ, గ్రామ కమిటీ ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో వారం రోజుల పాటు అఖండహరి నామ సాప్తహం కొకసాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తి కార్యక్రమాలు సాగుతాయి. ఉదయం జ్ఞానేశ్వరి పారాయణం, మధ్యాహ్నం గాత భజన, రాత్రి కీర్తన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

జాతరకు ఏర్పాట్లు పూర్తి...

ఆదివారం కార్తీక పౌర్ణమి ఉత్సవాల కోసం ఆలయ కమిటీ జాతరకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ జాతరకు మండల కేంద్రంతో పాటు ముధోల్‌, భైంసా, కుభీర్‌, మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, నాందేడ్‌, భోకర్‌ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ కమిటీ, ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

అంతర్రాష్ట్ర మల్లయోధులకు

కుస్తీపోటీలు...

జాతర సందర్భంగా గ్రామ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చే మల్లయోధులకు కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.11,111వేలు, వెండి కడియం, ద్వితీయ బహుమతిగా రూ.8,851 వెండి కడియంతో బహూకరించి మల్లయోధులను సన్మానిస్తారు.

విఠల రుక్మాయి  ఉత్సవమూర్తులు
1/1

విఠల రుక్మాయి ఉత్సవమూర్తులు

Advertisement
Advertisement