● జాబితాలో కనిపించని ఉద్యోగుల పేర్లు ● అధికారుల వద్ద కొరవడిన స్పష్టత | Sakshi
Sakshi News home page

● జాబితాలో కనిపించని ఉద్యోగుల పేర్లు ● అధికారుల వద్ద కొరవడిన స్పష్టత

Published Sun, Nov 26 2023 12:10 AM

- - Sakshi

ఇక్కడ కనిపిస్తున్నది ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లయ్య. బ జార్‌హత్నూర్‌ మండలంలో ఎస్జీటీగా పనిచేసే ఈయనకు ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ఓపీఓగా ఎన్నికల విధులు అప్పగించా రు. ఆర్డర్‌ కాపీ ఇచ్చిన రోజునే పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. శని వారం ఓటేసేందుకు రాగా జాబితాలో పేరు లేద ని చెప్పి బోథ్‌ నియోజకవర్గ ఆర్‌వో ను సంప్రదించాలని సిబ్బంది సూచించారు.

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ గందరగోళం ఆగడం లేదు. ఎన్నికల విధులు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. ఓటు వినియోగం కోసం వచ్చిన వారు అధికారుల నిర్వాకంతో ఆందోళనకు గురి కావాల్సి వస్తోంది. పీవో, ఏపీవో, ఓపీఓగా ఎన్నికల విధులకు నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు వినియోగం కోసం జిల్లా కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్తున్నారు. వారికి బ్యాలెట్‌ను అందించాల్సిన అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ జాబితాలో మీ పేర్లే లేవని చెప్పడంతో ఖంగు తింటున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసేదేమి లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు అందని వారిలో అత్యధికంగా బోథ్‌ నియోజకవర్గంలో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులే. ఈ నెల 28 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి అవకాశముందని సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల మిస్సింగ్‌ అయిన వారికి అవసరమైన సమాచారమందించేందుకు ఆదిలాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ప్రత్యేక హెల్ప్‌ డెస్కు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement