హార్ట్ఎటాక్ స‌మ‌స్య వెంటాడుతుందా..? అయితే ఇలా చేయండి!

25 Dec, 2023 11:53 IST|Sakshi

'ఈ మ‌ధ్య కాలంలో దాదాపుగా 30 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు తరచుగా మృతి చెందుతూ ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది. ప్రణాళిక లేని ఆహారపు అలవాట్లు, మద్యపానం, సరైన వ్యాయామం లేకపోవడం, క్రిమిసంహారక మందులతో పండించిన కూరగాయలు, దినుసులు వంటివాడకం మితిమీరిపోవడంతోనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.'

  • పెరుగుతున్న హృద్రోగ, కాలేయ సమస్యలు
  • తరచుగా ఆకస్మిక మరణాలు
  • నాలుగుపదుల వయసువారే అధికం
  • అసమతుల్య ఆహారపు అలవాట్లు, జీవనశైలే కారణం
  • క్రమబద్ధమైన నియమాలు పాటించాలంటున్న ఆరోగ్యనిపుణులు

ఎన్నో కారణాలు..
ప్రధానంగా గుండె లయతప్పడానికి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పెద్దగా కారణాలేవి లేకుండానే ఇటువంటి ప్రమాదం సంభవిస్తుంది. కొందరిలో మాత్రం గుండె కండరం మందం కావడం, పుట్టుకతో గుండెలో ఉండే లోపాలు, కర్ణికలు పెద్దగా ఉండడం, జన్యుపరంగా తలెత్తే ఇతర ఇతర సమస్యలు రక్తంలో ఖనిజలవణాల సమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి కారణమవున్నాయి.

బాగున్న కండరం మధ్యభాగంలోని కణాలు అతి చురుకుగా స్పందించడంతో కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. దీంతో శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, ఫలితంగా తలతిరగడం, స్పహ తప్పి కోల్పోవడం, నిమిషాల వ్యవధిలోని మరణం సంభవించడం వంటి వాటికి ఆస్కారం ఉంటుంది.

జీవనశైలిలో మార్పుతోనే నివారణ..
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఒత్తిడిలతో కూడిన జీవన విధానంలో ప్రశాంతత లోపించడం సమయభావంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం నడక, వ్యాయామక కసరత్తులు, యోగా, మెడిటేషన్‌ వంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాలేయ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా ఆహారపు అలవాట్లు ప్రభావం చూపుతాయి. సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తుల్లో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి..
ఈ రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఎటువైపు నుంచి మంచికొస్తుందో తెలియనిస్థితిలో ఉన్నాం. ఆరో గ్యపరంగా శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకునే విధంగా నియమాలు పాటించాలి. ఆహారం పరంగా, శారీరకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎండపెల్లి అశోక్‌కుమార్‌, మైథిలీ వెల్‌నెస్‌ సెంటర్‌, నిర్మల్‌

నిరంతర పరీక్షలతోనే నివారణ
గుండె సంబంధిత జబ్బులు ప్రస్తుత కాలంలో అధికమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు గుండె, కాలేయ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరీక్షలను చేయించుకోవాలి. – డాక్టర్‌ ఎం.ఎస్‌. ఆదిత్య, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌

>
మరిన్ని వార్తలు