ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక

17 Jun, 2021 15:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కోవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు 9 లక్షల డోసులు గురువారం చేరాయి. గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లు తరలించారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కోవిడ్‌ కేసులు తగ్గుతున్నాయని రిలాక్స్‌ అవ్వొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కోవిడ్‌ జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్‌ వేవ్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించిన సంగతి విదితమే. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇస్తోంది. కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతోంది. జూన్‌ 20 తర్వాత సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే.. ప్రస్తుతం 5.97 శాతం ఉంది.

చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు
రైతుల పట్ల ప్రతిపక్షానిది కపట ప్రేమ: సజ్జల

మరిన్ని వార్తలు