చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేరు: మంత్రి అంబటి

20 May, 2022 16:30 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘చం‍ద్రబాబు జిమిక్కులను ప్రజలు నమ్మె స్థితిలో లేరు. అధికారం కోసం ఎంతకైనా దిగజారీపోయే వ్యక్తి చంద్రబాబు. బీసీలకు రాజ్యసభ సీటు ఇస్తే చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేవు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదే. చంద్రబాబు ఎప్పటికే మాజీ ముఖ్యమంత్రే తప్ప మళ్లీ సీఎం కాలేరు. రాయలసీమకు చంద్రబాబు చేసింది ఏమిటి’’ అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి:  దావోస్‌కు పయనమైన సీఎం వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు