రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం.. సీఎం జగన్‌ శుభాకాంక్షలు

21 Jul, 2022 21:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము విజయం.. వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మహిళా, బలహీన వర్గాల సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ప్రజా జీవితంలో ముర్ముకు ఉన్న గొప్ప అనుభవం, ఆమె ఎన్నికైన అత్యున్నత పదవిని అలంకరించిందని ముఖ్యమంత్రి అన్నారు.
చదవండి: కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే 

మరిన్ని వార్తలు