ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

7 Jun, 2021 13:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల బృందం పరిశీలించిందని.. కె మందును పంపిణీ చేయొచ్చని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కి కోర్టు వాయిదా వేసింది.

కాగా, నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. 

చదవండి: ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి
ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

మరిన్ని వార్తలు