ఏపీలో ఆగిన పంచాయతీలకు పోలింగ్‌

15 Mar, 2021 12:42 IST|Sakshi

13 సర్పంచి పదవులకు నోటిఫికేషన్‌ జారీచేస్తే 

6 చోట్ల ఎన్నికల ప్రక్రియ 3 చోట్ల ఏకగ్రీవం.. 

4 చోట్ల రెండోసారి కూడా దాఖలుకాని నామినేషన్లు

 723 వార్డు పదవులకు నోటిఫికేషన్‌ జారీచేస్తే 55 చోట్లే పొలింగ్‌ 

సాక్షి, అమరావతి: నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయక, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయిన సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 13 పంచాయతీల సర్పంచి పదవులతో పాటు 372 పంచాయతీల పరిధిలో 723 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 13 సర్పంచి పదవులకుగాను 3 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది.

4 చోట్ల రెండోసారి కూడా సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 6 చోట్ల సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్‌ అనంతరం ఓట్లు లెక్కిస్తారు. 6 సర్పంచి పదవులకు 14 మంది పోటీలో ఉన్నారు. 723 వార్డు సభ్యుల పదవులకుగాను 561 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 55 వార్డులకు సోమవారం పోలింగ్‌ జరగుతోంది. ఈ వార్డుల్లో 112 మంది పోటీలో ఉన్నారు.
చదవండి:  ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.

మరిన్ని వార్తలు