AP: 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు: రైల్వే శాఖ మంత్రి

4 Apr, 2023 16:25 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.

2022 ఏప్రిల్ నెల వరకు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించామన్నారు. వాటి దూరం 5,581 కిలోమీటర్లు కాగా, 70,594 కోట్లుతో చేపట్టామన్నారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, మార్చి 2022  వరకు 636 కిలోమీటర్ల దూరాన్ని 19,414 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2014-19 మధ్య 219 శాతానికి పైగా రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం జరిగిందని జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు

అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద 72 స్టేషన్ల అభివృద్ధి 
అమృత్ భారత్ స్టేషన్ స్కీం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను, వాటిలో 72 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించగా అందులో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్‌ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం

మరిన్ని వార్తలు