దసరాకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే.. 

10 Oct, 2021 16:04 IST|Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రద్దీ మార్గాల్లో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పలు ప్రత్యేక పూజా స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08579) వీక్లీ  అక్టోబర్‌ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08580) సికింద్రాబాద్‌లో అక్టోబర్‌ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40కు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (చదవండి: Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు..

విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ విశాఖపట్నంలో అక్టోబర్‌ 18, 25, నవంబర్‌ ఒకటి తేదీల్లో రాత్రి 7.15 బయలుదేరి.. మరుసటి రోజు ఉద యం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08584) తిరుపతిలో అక్టోబర్‌ 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో రాత్రి 9.55 బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08585) స్పెషల్‌ విశాఖపట్నంలో అక్టోబర్‌ 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో సాయంత్రం 5.35 బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో(08586) సికింద్రాబాద్‌లో అక్టోబర్‌ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతుంది.
చదవండి:
ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం

 

మరిన్ని వార్తలు