సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీనివాస్‌

24 Sep, 2020 11:40 IST|Sakshi

సాక్షి, తిరుపతి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌ కలిశారు. గురువారం ఉదయం శ్రీ పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తన తండ్రి హయాంలో ప్రారంభించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మధ్యలో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. నాన్నగారు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించారు. అయితే కోర్టు కారణాలు, రాజకీయాల వల్ల ఆగిపోయింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్‌కు వివిధ ప్రాంతాల నుంచి దాతలు 150 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని నాన్నగారి చివరి కోరికను నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు’  అని తెలిపారు. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు)

కాగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీవారి ఆలయం మొత్తం పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాలని ఆదికేశవులు నాయుడు నిర్ణయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు